జైలునుంచి పెరోల్‌పై వచ్చాడు.. కానిస్టేబుల్ భార్యను కడతేర్చాడు - MicTv.in - Telugu News
mictv telugu

జైలునుంచి పెరోల్‌పై వచ్చాడు.. కానిస్టేబుల్ భార్యను కడతేర్చాడు

April 4, 2020

Accused on coronavirus parole incident cop’s wife

ఓ వైపు కరోనా భయం ఉంటే మరోవైపు ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. జైళ్లల్లో కరోనా వైరస్ విస్తరించకుండా ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొందరు ఖైదీలను పెరోల్‌పై విడుదల చేసిన విషయం తెలిసిందే. అలా విడుదలైన ఓ ఖైదీ శనివారం ఓ కానిస్టేబుల్ భార్యను కత్తితో పొడిచి హత్యచేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. కానిస్టేబుల్ అశోక్ మూలే కుమారుడు, తన స్కూల్ మేట్ అయిన నవీన్‌ను కలిసేందుకు నిందితుడు నవీన్ గొటాఫోడ్ (27) నందన్‌వన్ ప్రాంతంలోని వారింటికి వెళ్లాడు. అయితే, ఇంట్లో ఉన్న కానిస్టేబుల్ భార్య సుశీల (52) తన కుమారుడిని కలిసేందుకు వీలులేదని అభ్యంతరం చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన  నిందితుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

ఆమె కుమారుడు నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతడిపైనా దాడికి దిగాడు. కత్తి గాయాలతో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. నిందితుడు వెంటనే అక్కడినుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో కుప్పకూలిన సుశీలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యుల ద్రువీకరించారు. కాగా, నిందితుడు నవీన్ ఓ వాహన దొంగతనం కేసులో జైలుకు వెళ్లాడు. ఇటీవల కరోనా ప్రభావంతో పెరోల్‌పై బయటకు వచ్చాడు. నిందితుడిపై ఓ మర్డర్ కేసు కూడా ఉందని జాయింట్ కమిషనర్ రవీంద్ర కదమ్ వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.