హైదరాబాద్‌పై అచ్చెన్నాయుడి హాట్ కామెంట్స్ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌పై అచ్చెన్నాయుడి హాట్ కామెంట్స్

March 7, 2022

ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లుగా రాజ్యాంగ వ్యవస్థలపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని టీడీపీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. సోమవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ”రాజ్యాంగ వ్యవస్థలపై దాడి జరుగుతున్నా గవర్నర్ పట్టించుకోవట్లేదు. గవర్నర్‌ను అడ్డు పెట్టుకొని ప్రభుత్వం చట్టం ఉల్లంఘనలకు పాల్పడింది. న్యాయ వ్యవస్థపై దాడి జరిగినా గవర్నర్ స్పందించలేదు. గవర్నర్ పేరు మీద అప్పులు తీసుకున్నప్పుడూ పట్టించుకోలేదు. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తే.. గవర్నర్ స్పందించలేదు. సీఆర్డీఏ చట్టం ఆహ్వానితు ఎవరింట్లోనే తయారు చేసింది కాదు” అని ఆయన మండిపడ్డారు.

అంతేకాకుండా “ఏపీ రాజధాని హైదరాబాదే అయితే.. అక్కడికే వెళ్లిపోండి. రాష్ట్రం నుంచి పాలించాలనే మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు హైదరాబాదే రాజధాని అంటే ఏం చేయగలం?” అని అచ్చెన్నాయుడు అన్నారు. విభజన చట్టం ప్రకారం 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాద్ అని బొత్స అన్నారు. అమరావతి రాజధానిగా పార్లమెంట్ నుంచి ఆమోదం రాలేదని.. రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.