రెండో రోజూ భారీగా పడిపోయిన ఆచార్య కలెక్షన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

రెండో రోజూ భారీగా పడిపోయిన ఆచార్య కలెక్షన్స్

May 2, 2022

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. భారీ అంచనాల మధ్య శుక్రవారం(ఏప్రిల్‌ 29) విడుదలైన ఈ సినిమాకు.. తొలిరోజు నుంచే డివైడ్ టాక్ నడుస్తోంది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 40 కోట్ల గ్రాస్‌, 29.5 కోట్లు షేర్‌ సొంతం చేసుకున్న ఈ సినిమా.. రెండో రోజు మాత్రం కేవలం రూ. 5.15 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు తలలుపట్టుకుంటున్నారు.

రెండో రోజు నైజాంలో రూ.7.90 కోట్లు, సీడెడ్‌లో రూ.4.6 కోట్లు, ఈస్ట్‌లో రూ.2.53, వెస్ట్‌లో 2.90, గుంటూరులో 3.76, కృష్ణలో రూ.1.90, నెల్లూరులో 2.30 కోట్లను రాబట్టింది. ఏపీ, తెలంగాణలో రెండు రోజుల షేర్ రూ.34.65 కోట్లు కాగా, కర్ణాటక, రెస్టాఫ్ ఆఫ్ ఇండియాలో రూ. 2.22 కోట్లు, ఓవర్సీస్ కలెక్షన్లు రూ. 4.20 కోట్లు వసూళ్లు రాబట్టింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రెండు రోజుల షేర్ రూ. 42 కోట్లు గ్రాస్‌, 31. కోట్లు షేర్‌ సాధించింది. . ఈ ఏడాది విడుద‌లైన స్టార్ హీరోల సినిమాల్లో ఇదే అత్యంత త‌క్కువ కావ‌డం గమ‌నార్హం. యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రాంచ‌ర‌ణ్ సిద్ధ పాత్ర‌లో న‌టించ‌గా..పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టించింది.

ఆచార్య సినిమా విడుదలకు ముందు రూ.133 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగింది. ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే రూ. 134 కోట్ల షేర్‌ రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం రూ.31.93 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.102.07 కోట్లు షేర్ ను రాబట్టాలి. మిక్స్ డ్ టాక్‌ తెచ్చకున్న ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మేర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌డుతుందో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.