Acharya movie exhibitors protest in front of Koratala Shiva office
mictv telugu

‘ఆచార్య’ ఎగ్జిబిటర్ల కష్టాలు.. కొరటాల ఆఫీసు ముందు ధర్నా

July 13, 2022

Acharya movie exhibitors protest in front of Koratala Shiva office

మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రాంచరణ్‌తో కలిసి నటించిన ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఈ ముగ్గురి కెరీర్లో భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇంత పెద్ద ఫ్లాప్ సినిమాను తీసిన కొరటాల శివపై విమర్శలు వచ్చాయి.

దీంతో అప్పటివరకు ఓటమెరుగని కొరటాల శివ ఈ సినిమా ఫలితంతో డీలా పడిపోయాడు. అయితే సినిమాను కొని నష్టపోయిన ఎగ్జిబిటర్లు మాత్రం తమకు జరిగిన నష్టాన్ని పూడ్చాలని కొరటాల శివను డిమాండ్ చేస్తున్నారు. ఈ చిత్రం వల్ల రూ.15 కోట్ల నష్టపోయామని, అందులో ఎంతో కొంత భర్తీ చేయాలని ఆయన ఆఫీసు ముందు నిన్నరాత్రి నుంచి ధర్నా చేస్తున్నారు. లేదంటే చిరంజీవి ఇంటి ముందు ధర్నా చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. అయితే డబ్బుల కోసం కొరటాల శివను ఎందుకు అడుగుతున్నారని అడిగితే.. ‘సినిమాను నిర్మాతల నుంచి కొరటాల శివ తీసుకొని బయ్యర్లకు అమ్మాడ’ని అందుకే అతడినే అడుగుతున్నట్టు వారు వెల్లడిస్తున్నారు.