మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయిన ఈ మూవీని ఓటీటీలోనైనా అదృష్టం వరింస్తుందనే ఆశతో ఉంది మూవీ టీమ్. ‘ఆచార్య’ను ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది.
they call him Acharya because he always teaches them a lesson💥#AcharyaOnPrime, May 20 pic.twitter.com/5l4wnFgLn7
— amazon prime video IN (@PrimeVideoIN) May 13, 2022
గ్లోబల్ డిజిటల్ ప్రీమియర్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ సంస్థ తెలిపింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత నెల 29న థియేటర్లలో విడుదలైంది. ఆధ్యాత్మికం, నక్సలిజం కలగలిపి తీయడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా మెగా ఫ్యామిలీ అభిమానులు మాత్రం బాగానే చూశారు.