‘ఆచార్య’ ట్రైలర్, మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆచార్య’ ట్రైలర్, మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

April 9, 2022

xvdv

మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ ఇద్దరూ కలిసి తొలిసారి నటిస్తున్న ఆచార్య చిత్రం విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ఈ నెల 12వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. 29న సినిమా విడుదలవుతుందని అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా రాంచరణ్, పూజా హెగ్డేల పోస్టరును విడుదల చేసింది. సినిమాలో తండ్రీ, కొడుకుల 20 నిమిషాల యాక్షన్ సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా రాం చరణ్ చేసిన ‘సిద్ధ’ పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. రాజమౌళిలా అపయజమెరుగని కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం సినిమాను మరో మెట్టుకు తీసుకెళ్లడం ఖాయమని ధీమాగా చెప్తున్నారు. కాగా, హీరోయిన రెజీనా స్పెషల్ సాంగులో నర్తించిన విషయం తెలిసిందే.