ఆవులపై యాసిడ్ దాడేంది సామీ..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆవులపై యాసిడ్ దాడేంది సామీ..!

August 22, 2017

తనను ప్రేమించలేదని ఆడోళ్ల మీద యాసిడ్ దాడి జేసే  బద్మాష్ గాళ్ల గురించి మనకు తెలుసు. ఇలాంటి వార్తలు పేపర్లల్ల, టీవీలల్ల చాలానే చూశాం. కానీ ఉత్తర ప్రదేశ్ ఆగ్రా జిల్లాల.. పాపం ఉత్త పుణ్యానికి  మూగజీవాలపై యాసిడ్ దాడి జేసిన్రు కొందరు దుండగులు.

ఓ గ్రామంల  ఎవ్వలు లేనిది జూసి, ఆవులపై, ఎద్దులపై యాసిడ్ సల్లి పోయిన్రట బట్టెవాజ్ గాళ్లు. పాపం అవి ఎంత గోసవడ్డయో ఏమో. అయినా ఎవలమీదనన్న కోపం ఉంటే వాళ్లతోని మాట్లాడాలె.. లేకపోతే వానితోనే కొట్లాడాలె కనీ.. గిట్ల మూగజీవాలపై ప్రతాపం జూపెట్టుడేంది? అవ్విటిమీద యాసిడ్ పొయ్యనీకి ఆళ్లకు సేతులెట్లచ్చినయ్? ఆళ్ల సేతిలిర్గిపోను! అని మస్తు తిట్టుకుంటున్నరట గా ఊరోళ్లంత. యాసిడ్ దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు గుడ కేసు నమోదు జేశి భరోసా ఇచ్చిన్రట.