ముగ్గురు దళిత బాలికలపై యాసిడ్ దాడి.. యూపీలో - MicTv.in - Telugu News
mictv telugu

ముగ్గురు దళిత బాలికలపై యాసిడ్ దాడి.. యూపీలో

October 13, 2020

యూపీలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు ఏ మాత్రం ఆగడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక చాలా మంది అమ్మాయిలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటికి తోడు యాసిడ్ దాడులు కూడా పెరిగిపోయాయి. గత రాత్రి ముగ్గురు దళిత అమ్మాయిలపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి ఒడిగట్టారు. నిద్రిస్తున్న సమయంలో వారిపై యాసిడ్ చల్లి పారిపోయారు. గోండా జిల్లాలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వారంతా తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. 

బాలికలు ముగ్గురు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. వెంటనే వారిపై యాసిడ్ చల్లడంతో ఇద్దరి కాలుకు గాయాలు కాగా, మరో బాలిక మొహం కాలిపోయింది. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి వయసు 8,12,17 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు పాల్పడింది ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. రాష్ట్రంలో వరుసగా మహిళలపై ఇలాంటి దాడులు జరుగుతుండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.