ప్రగతి భవన్ ముట్టడి ఎఫెక్ట్..ఏసీపీపై బదిలీ వేటు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రగతి భవన్ ముట్టడి ఎఫెక్ట్..ఏసీపీపై బదిలీ వేటు

October 23, 2019

narasimha reddy

 సోమవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఓ పోలీస్ అధికారి ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై బదిలీ వేటు పడింది. 

ప్రగతి భవన్ ముట్టడి సమయంలో విధుల్లో అలసత్వం వహించడంతో ఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై బదిలీ వేటు పడింది. నరసింహారెడ్డి ప్రగతిభవన్ ముందు ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఆసిఫ్ నగర్ సబ్ డివిజన్ బాధ్యతలను డీసీపీ సుమతి పర్యవేక్షించనున్నారు.