Action against Gorantla Madhav is not amiss: Sajjala
mictv telugu

గోరంట్ల మాధవ్‌పై చర్యలు తప్పవు: సజ్జల

August 4, 2022


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన ఓ న్యూడ్ వీడియో నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వీడియోను వీక్షిస్తున్నవారంతా బాధ్యత గల ఓ ఎంపీ ఇలాంటి వీడియోలు చెయొచ్చా? అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కాసేపటిక్రితమే ప్రభుత్వ చీప్ విప్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

”ఇది ప్రైవేటు వ్యవహారానికి చెందిన వీడియో. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి (గోరంట్ల మాధవ్) తనపై వచ్చిన ఆరోపణలను నిరాకరిస్తున్నాడు. ఈ వీడియో మార్ఫింగ్ చేసిందని గోరంట్ల మాధవే చెబుతున్నాడు. ఒకవేళ అది మార్ఫింగ్ చేసిన వీడియో కాదని తేలితే మాత్రం అతడిపై కఠినాతికఠినమైన చర్యలు ఉంటాయి. ఓ రాజకీయ పార్టీ ఎంతమేరకు చర్య తీసుకోగలదో ఆ స్థాయిలో చర్యలు ఉంటాయి.” అని ఆయన అన్నారు.

మరోవైపు ఎంపీ గోరంట్ల మాధవ్ అనుచరులు అనంతపురం 2టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నాయకుని పరువుకు భంగం కలిగించే విధంగా నగ్నంగా వీడియోలు వైరల్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన సిఐ రాఘవన్.. వీడియోను ఎవరు క్రియేట్ చేశారు? ఎందుకు చేశారు? ఆ మహిళ ఎవరు? అనే విషయాలపై ఆరా తీస్తామని అన్నారు.