Action stunt choreographer kenny bates joins jr ntr 30 film
mictv telugu

జూ.ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ యాక్షన్ మేకర్స్

March 26, 2023

Action stunt choreographer kenny bates joins jr ntr 30 film

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్..ప్రస్తుతం NTR30 సినిమాపై ఫోకస్ పెట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల హైదారాబాద్‎లో ఘనంగా జరిగింది. దీంతో అభిమానునల నీరిక్షణకు తెరపడింది.‘బాహుబలి’, ‘కె.జి.యఫ్’ సినిమాలతో ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన ఎస్.ఎస్.రాజమౌళి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ 30వ సినిమాను ప్రారంభించారు. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌పై ముహూర్తపు సన్నివేశానికి ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ గౌరవ దర్శకత్వం వహించారు.త్వరలోనే షూటింగ్‌ మొదలుకానుంది.

ఆర్ఆర్ఆర్ ..ఆస్కార్ అవార్డు దక్కించుకోవడంతో పాటు పలు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టడంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టారే కాదు గ్లోబల్ స్టార్ గా మారిపోయారు.విదేశాల్లో కూడా ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగింది. దీంతో NTR30 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే కొరటాల శివ సినిమాను తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

‘ఎన్టీఆర్30’పై సినిమా కోసం హాలీవుడ్‌ టెక్నీషియన్లు రంగంలోకి దిగారు. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ‘కెన్నీ బేట్స్’ ఈ సినిమాకు పనిచేస్తున్నట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది. ఓ భారీ యాక్షన్ సీన్‌ను డిజైన్ చేస్తున్న ఫోటును ట్విట్టర్‎లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోను బ‌ట్టి చూస్తే పెద్ద షిప్‌లో ఫైట్‌ను తీయబోతున్నార‌ని తెలుస్తోంది. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’, ట్రాన్స్ ఫార్మర్స్, రష్ హవర్ 3, పెర్ల్ హార్బర్ వంటి చిత్రాలకు పనిచేసిన కెన్నీ బేట్స్ టీం ఎన్టీఆర్30 చిత్రానికి యాక్ష‌న్ పార్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. గ‌తంలో ప్ర‌భాస్ ‘సాహో’ చిత్రానికి కూడా యాక్షన్ సీన్స్ ను కెన్నీ బేట్స్ పనిచేశారు.

ఆచార్యతో మెగస్టార్ చిరంజీవికి ప్లాప్ ఇచ్చిన కొరటాల..ఎన్టీఆర్ సినిమాపై ఫోకస్ పెట్టారు. ఇటీవల ఆయనపై మెగా అభిమానులు చేసిన విమర్శలు నేపథ్యంలో నెక్స్ట్ సినిమాను హిట్ కొట్టాలని బరిలోకి దిగుతున్నారు. NTR30 చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకుడు కాగా, సినిమాటోగ్రాఫర్‌గా రత్నవేలు పనిచేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన జనతాగ్యారేజ్ బ్లాక్ బాస్టర్ అయ్యింది.