యాక్టివాలో లోపాలు.. 56,194 బండ్లు వెనక్కి.. - MicTv.in - Telugu News
mictv telugu

యాక్టివాలో లోపాలు.. 56,194 బండ్లు వెనక్కి..

April 2, 2018

దేశీయ మార్కెట్లో దూసుకుపోతున్న యాక్టివా స్కూటర్లో లోపాలు ఉన్నట్లు తెలిసింది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 56,194 బండ్లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. ఆ సంస్థ ఉత్పత్తి చేసిన యాక్టివా 125, గ్రాజియా, ఏవియేటర్ మోడల్ స్కూటర్లలో లోపాలు బయటపడ్డాయి. వీటి ఫ్రంట్ ఫోర్క్ వద్ద బిగించిన బోల్ట్‌లో లోపం ఉన్నట్టు తేలింది. దీంతో బ్రాండ్‌ చెడ్డపేరు రాకండా ఆ వాహనాలను రీకాల్ చేస్తున్నారు. వాటిని తిరిగి పరీక్షించి, కొత్తరకం బోల్టును మారుస్తామని హోండా కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గ్రాజియా గతేడాది మార్కెట్లోకి వచ్చింది.  

రీకాల్ ఇలా

డీలర్లు వినియోగదారులకు ఫోన్ చేసి విషయం వివరిస్తారు. తర్వాత వాహనాలను వెనక్కి తెప్పించనున్నారు. కొత్త బోల్టు బిగించి ఇస్తారు. దీనికి డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు.