ఆంధ్రప్రదేశ్లో ఓ మంత్రి తనను ఎంతోగానో అభిమానించే ఓ కార్యకర్త చెంపను చెల్లుమనిపించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఏపీ రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కొత్తగా మంత్రి పదవి చేపట్టిన తర్వాత శనివారం తొలిసారి తన సొంత జిల్లా శ్రీకాకుళంకు ఆయన వచ్చారు.
తమ మంత్రి మొదటిసారి జిల్లాకు వచ్చారని వైసీపీ శ్రేణులు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆయనతో కరచాలనం చేసేందుకు కార్యకర్తలు ఒకరు మీద ఒకరు ఎగబడ్డారు. అయితే, ఓ కార్యకర్త మాత్రం మంత్రి చేయిని గట్టిగా లాగాడు. ఇక అంతే, సహనం కోల్పోయిన మంత్రి ధర్మాన.. ఆ కార్యకర్త నుంచి చేయిని వదిలించుకుని అతడి చెంపను చెల్లుమనిపించాడు.
మరోపక్క ధర్మాన ప్రసాదరావు అంటే శ్రీకాకుళంలో సౌమ్ముడిగా పేరుంది. అంతటి సౌమ్యుడు సహనం కోల్పోయి, తనకు స్వాగతం చెప్పేందుకు వచ్చిన కార్యకర్తపై చేయి చేసుకోవడంతో కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కెమెరాకు చాలా స్పష్టంగా చిక్కడంతో తెగ వైరల్ అవుతున్నాయి.
YSRCP అధర్మ బాదుడు pic.twitter.com/soZ3oE0xF4
— Telugu Desam Party (@JaiTDP) April 16, 2022