Activist Kanakadurga, who entered Sabarimala, marries Ayyankali Pada comrade
mictv telugu

శబరిమల వివాదం.. విడాకులు తీసుకున్న కనకదుర్గకు రెండో పెళ్లి

July 6, 2022

Activist Kanakadurga, who entered Sabarimala, marries Ayyankali Pada comrade

2019లో శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకున్న మ‌హిళా కార్య‌క‌ర్త క‌న‌క‌దుర్గ‌ మళ్లీ పెళ్లి చేసుకుంది. 10 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్న మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌లను దర్శించవచ్చన్న సుప్రీం సంచ‌ల‌న తీర్పుతో.. కనకదుర్గతో పాటు బిందు అమ్మిని అనే లాయర్ జనవరి 2, 2019న ప్ర‌త్యేక భ‌ద్ర‌త మ‌ధ్య ఆల‌య ద‌ర్శ‌నం చేసుకున్నారు.

అయితే కనకదుర్గ అయ్య‌ప్ప గుడికి వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత ఆమె ఇంట్లో గొడ‌వ‌లు జ‌రిగాయి. దీంతో ఆ ఏడాది జూన్‌లో ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్న‌ది. ఈ క్రమంలో మావో సానుకూల అయ్యంక‌లి ప‌ద గ్రూపులో చాన్నాళ్లుగా కామ్రేడ్‌గా చేస్తున్న శివ‌న్‌కుట్టితో ఏడాది కింద క‌న‌క‌దుర్గ‌కు పరిచ‌యం అయ్యింది. ఆ ప‌రిచ‌యం పెళ్లికి దారితీసింది. స్పెష‌ల్ మ్యారేజ్‌ యాక్ట్ ప్ర‌కారం ఆ ఇద్ద‌రూ త‌మ పెళ్లిని రిజిస్ట‌ర్ చేసుకున్నారు. ఇద్దరం ఒంట‌రిగా జీవిస్తున్నామ‌ని, ఇద్ద‌ర‌మూ కార్య‌క‌ర్త‌లేమ‌ని, ఇప్పుడు మేం ఇద్ద‌రం క‌లిసి జీవించాల‌ని భావిస్తున్న‌ట్లు శివ‌న్‌కుట్టి తెలిపాడు.