వైవిధ్యభరితమైన నటన, కథా చిత్రాలతో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడవిశేష్. ఇతను తాజాగా నటించిన చిత్రం మేజర్. వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గూఢచారి చిత్రాన్ని తీసిన శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. జూన్ 3న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో ఏకకాలంలో విడుదలవుతోంది. దీంతో సినిమా ప్రమోషన్లలో అడవి శేష్ పాల్గొంటున్నాడు.
ఈ సందర్భంగా కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకొచ్చాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నవదీప్, శివబాలాజీ, కాజల్ అగర్వాల్, సింధు మీనన్ పాత్రధారులుగా వచ్చిన చందమామ చిత్రం మంచి హిట్ సాధించింది. అయితే ఇందులో ముందుగా నవదీస్ పాత్రకు అడవి శేష్‌ను సెలెక్ట్ చేశారు. రెండు రోజులు షూటింగ్ కూడా చేశాక అర్ధాంతరంగా తొలగించారని గుర్తు చేసుకున్నారు. అలాగే శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం సినిమాలో పెద్ద రోల్ అని చెప్పి చివరికి కేవలం ఐదు సెకన్లు ఉన్న పాత్ర ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎందుకిలా జరిగిందో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు అడవి శేష్.