actor ali meet telangana governor
mictv telugu

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన అలీ

November 10, 2022

సినీ నటుడు అలీ తన కుమార్తె ఫాతిమా పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. వివాహ ఆహ్వాన పత్రికలు ఇచ్చి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ మధ్యనే సీఎం జగన్‌ను కలిసి వివాహానికి ఆహ్వానించిన అలీ తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళి‌సై ను కలిసి పెళ్లి పత్రిక అందజేశారు. వివాహానికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. పెళ్లిపత్రిక స్వీకరించిన తమిళిసై కూడా, తప్పకుండా వివాహానికి హాజరు అవుతాను అని అలీకి మాటిచ్చారు.

అలీ తన పెద్ద కుమార్తె ఫాతిమా ఎంగేజ్మెంట్‌ని ఇటీవలే హైదరాబాద్ లో అట్టహాసంగా జరిపించారు. మెడిసన్ చదివిన ఆమెను డాక్టర్లతో నిండిన ఒక కుటుంబానికి ఇచ్చి వివాహాం చేస్తున్నారు. ఫాతిమా మనువాడే వరుడు కూడా డాక్టరే అని తెలుస్తోంది. ఇటు రాజకీయాల్లో కూడా అలీ యాక్టివ్‌గా ఉన్నారు. కొద్దిరోజులు కిందటనే అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా సీఎం జగన్ నియమించారు.