మేకప్‌ రూంలో చదివి 93% మార్కులు సాధించా..బాలీవుడ్‌ నటి - MicTv.in - Telugu News
mictv telugu

మేకప్‌ రూంలో చదివి 93% మార్కులు సాధించా..బాలీవుడ్‌ నటి

May 8, 2019

ఓ పక్క సినిమా షూటింగ్‌లలో క్షణం తీరిక లేకుండా గడుపుతూనే.. మరోపక్క సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్లో 93 శాతం మార్కులు సాధించారు బాలీవుడ్‌ నటి ఆష్నూర్‌ కౌర్‌. ఈ విషయాన్నీ ఆమె సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Actor Ashnoor Kaur scores 93% in CBSE class 10 boards, says she studied in the makeup room.

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..ఓ పక్క షూటింగ్స్‌ చూసుకోవాలి, మరోపక్క చదువుకోవాలి చాలా కష్టంగా అనిపించిందని తెలిపారు. రెండింట్లో ఏదీ వదులుకోలేదన్నారు. ఏదేమైనా తాను పది పరీక్షల్లో 90 శాతం సాధించాలని దృఢంగా నిర్ణయించుకున్నానని.. కానీ అంతకంటే ఎక్కువగా సాధించి నన్ను నేను నిరూపించుకున్నానని తెలిపారు. బాల నటీనటులు చదువుల్లో సరిగ్గా రాణించలేరన్న అభిప్రాయం చాలా మందిలో ఉందని.. అది తప్పని నిరూపించాలనుకుని.. విజయం సాధించానని తెలిపారు. పదో తరగతి చదివే వారికి ఫిబ్రవరి నెల మొత్తం చదువుకునే వీలుంటుంది. కానీ నాకు ఆ నెల మొత్తం చిత్రీకరణలు ఉన్నాయి. అయినా కూడా ఖాళీ సమయాల్లో మేకప్ రూమ్‌లో చదువుకున్నానని తెలిపారు.