బాలయ్య ‘నర్తనశాల’ను బాగానే చూస్తున్నారు.. ఇవీ కలెక్షన్లు! - MicTv.in - Telugu News
mictv telugu

బాలయ్య ‘నర్తనశాల’ను బాగానే చూస్తున్నారు.. ఇవీ కలెక్షన్లు!

October 26, 2020

actor balakrishna’s nartanasala movie collections

నటుడు బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘నర్తనశాల’ సినిమా ఈనెల 24న దసరా పండుగ కానుకగా శ్రేయాస్ ఈటీ అనే ఓటీటీలో విడుదలైంది. 2004లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కొన్ని రోజుల తరువాత సినిమా షూటింగ్ మధ్యలో ఉండగా ఇందులో నటిస్తున్న సౌందర్య అకస్మాతుగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించింది. దీంతో బాలకృష్ణ షూటింగ్‌ను నిలిపేశారు. 

అప్పటివరకు తీసిన 17 నిమిషాల సినిమాను బాలకృష్ణ శ్రేయాస్ ఈటీ అనే ఓటీటీలో పర్ వ్యూ పద్దతిలో విడుదల చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాకు ఇప్పటివరకు లక్షా 95 వేల టికెట్లు అమ్ముకుడు పోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఒక్కో టికెట్ ధరను 50 రూపాయలు నిర్ణయించారు. ఈ లెక్కన 1 లక్షా 95 వేల టికెట్లకు 50 రూపాయల చొప్పున లెక్కిస్తే మొత్తం మీద సినిమాకు మొదటి రోజు 97 లక్షల 50 వేల దాకా కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా వచ్చిన ఈ డబ్బు మొత్తాన్ని బాలయ్య సేవా కార్యక్రమాలకి వాడబోతున్నారు. బసవతారకం మెమోరియల్ ట్రస్ట్‌కు ఈ మొత్తాన్ని అందించనున్నారు.

https://twitter.com/i/status/1320681308972986368