Actor Brahmaji criticized Getup Sreenu
mictv telugu

గెటప్ శ్రీనుకి యాటిట్యూడ్ ఎక్కువైంది : బ్రహ్మాజీ సంచలన వ్యాఖ్యలు

October 4, 2022

Actor Brahmaji criticized Getup Sreenu

సీనియర్ నటుడు బ్రహ్మాజీ జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీనుపై మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. గెటప్ శ్రీను యాటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాదులో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బ్రహ్మాజీ ‘అన్నయ్య చిరంజీవితో కలిసి ఒక్కసారి విమానంలో వెళ్లినందుకే ఏదో తన వెంటే అన్నయ్య వచ్చినట్టు ఫోజు కొడుతున్నాడు. ఈ రోజు కూడా అన్నయ్యను అనుకరిస్తూ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు’ అని హాట్ కామెంట్స్ చేశారు. ఈ సమయంలో గెటప్ శ్రీను వేదికపైనే ఉండడం గమనార్హం. కాగా, ఈ చిత్ర హిందీ ట్రైలర్ రిలీజ్ సమయంలో చిరంజీవితో కలిసి గెటప్ శ్రీను విమానంలో ముంబై వెళ్లారు. అక్కడ వేదికపై సల్మాన్ ఖాన్, చిరంజీవితో కలిసి వేదిక పంచుకున్నారు. స్వయంగా చిరంజీవే గెటప్ శ్రీనుని సల్మాన్ ఖాన్‌కు పరిచయం చేశారు. దీంతో ముంబై ఈవెంట్‌కి వెళ్లి వచ్చినప్పటి నుంచి శ్రీనులో మార్పు కనిపిస్తోందని బ్రహ్మాజీ అన్నారు. కాగా, విజయదశమి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్ర టైటిల్ సాంగ్ ఇప్పటికే రిలీజై సినిమాపై అంచానాను పెంచింది.