పడవ కొంటా.. హైదరాబాద్ వరదలపై బ్రహ్మాజీ - MicTv.in - Telugu News
mictv telugu

పడవ కొంటా.. హైదరాబాద్ వరదలపై బ్రహ్మాజీ

October 19, 2020

vnvhnh

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణుకుతోంది. నగరం మధ్యలో నుండి వెళ్లే మూసి నది ఉప్పొంగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వర్షాలు తగ్గినప్పటికీ వరద నీరు అలాగే ఉంది. దీంతో హైదరాబాద్ వరదల గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు జోక్స్ వేస్తున్నారు. 

హైదరాబాద్‌లో ఉండాలంటే పడవ తప్పనిసరని పోస్టులు పెడుతున్నారు. కొందరు ఓలా, ఉబర్ యాప్‌లలో బోట్ సర్వీసు ఉందా అని అడుగుతున్నారు. తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కూడా వరదల గురించి సెటైర్ వేశారు. ‘ఓ మోటారు బోటు కొనాలని అనుకుంటున్నాను. దయచేసి ఓ మంచి బోటు గురించి తెలపండి’ అని ట్వీట్ చేశాడు. అలాగే తన ఇంటి చుట్టూ ఉన్న వరద నీరు ఫొటోలను పోస్ట్ కూడా చేశాడు. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయనకు బోట్ లను సూచిస్తున్నారు. మరి కొందరు మీరు ఇళ్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిని డ్యామేజీ చేయకూడదని హితవు పలుకుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.