చిరంజీవి గుండు లుక్ రహస్యం ఇదే.. వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

చిరంజీవి గుండు లుక్ రహస్యం ఇదే.. వీడియో

September 15, 2020

vbn

కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి గుండు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెల్సిందే. గుండు చేయించుకుని, నల్లటి కద్దాలతో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంటూ ‘నేను సాధువులా ఉన్నానా’ అంటూ చిరంజీవి అర్బన్‌మాంక్‌ హ్యాష్‌ ట్యాగ్‌ జోడించారు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చిరు ఏంటీ లుక్? అంటూ కామెంట్లు పెట్టారు. చిరు తనయుడు రామ్‌చరణ్‌ కూడా ‘నాన్న నేను చూస్తున్నది నిజమేనా’ అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అయితే, చిరు నిజంగా గుండు చేయించుకున్నారా? లేక ఏదైనా యాప్‌ మహిమా? లేదా మేకప్ ఆ? అన్నది తెలియరాలేదు. 

తాజాగా దీనిపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. తన అర్బన్ మాంక్ లుక్ మేకింగ్ వీడియోను చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అలాగే మలయాళం హిట్ మూవీ ‘లూసిఫర్’, తమిళ్ హిట్ ‘వేదలమ్’ రీమేక్ లలో చిరు నటిస్తారని తెలుస్తోంది. వేదలమ్ రీమేక్ లో చిరు చెల్లి పాత్రలో సాయి పల్లవి నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.