అయ్యప్ప-ఆడవాళ్లపై రజనీకాంత్ వింత వాదన   - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యప్ప-ఆడవాళ్లపై రజనీకాంత్ వింత వాదన  

October 20, 2018

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు శబరిమల అయ్యప్ప స్వామి అంటే ఎంతో భక్తి. ఆలయంలో నెలకొన్న ఉద్రిక్తతపై ఆయన స్పందించారు. అయితే కర్రవిరగకుండా పాము చావకుండా అభిప్రాయం వ్యక్తం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని ఆయన అన్నారు. అయితే గుడిలో ఎన్నోఏళ్లుగా వస్తున్న ఆచారాలను తూచ తప్పకుండా పాటించాలనీ, అందరూ గౌరవించాలనీ అన్నారు.Actor dual stand I welcome the decision but tradition must be followed, respected, says superstar Rajinikanth‘మహిళలను అయ్యప్ప గుడిలోకి అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పు సరిగానే ఉంది. తీర్పును నేను గౌరవిస్తున్నాను.  అయితే శబరిమల గుడి మతతపరమైన విశ్వాసాలతో ముడిపడింది కదా. ఈ విషయంలో ఆచారాలను పాటించాల్సిందే…ఆలయ వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదు’ అని అన్నారు. రజనీ తన తాజా చిత్రం పేట్టా  షూటింగ్ ముగించుకుని చెన్నై చేరుకున్న సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. సినీరంగంలో మహిళలపై వేధింపుల గురించి స్పందిస్తూ.. వారికి న్యాయం జరగాలన్నారు. తాను రాజకీయపార్టీ పెట్టే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.