బాలయ్య చూసుంటే చెంప పగిలేది - MicTv.in - Telugu News
mictv telugu

బాలయ్య చూసుంటే చెంప పగిలేది

October 25, 2017

అభిమానుల కోలాహలం తీవ్రస్థాయికి చేరినప్పుడు కోపంతో బాలయ్య వారి చెంపలను ఛళ్లుమనిపిస్తుండడం తెలిసిందే. అలాంటి బాలయ్య చాలా కూల్‌గా ఓ రెస్టారెంటులో ఒంటరిగా పానీయాలు తాగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆయన ఓ మూల కూర్చుని.. పరిసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా తన మానాన తన పనిచేసుకుంటున్నాడు.  వారు కూడా ఆయనను పెద్దగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది.  ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారో తెలియడం లేదు. సెలబ్రిటీ అయినా బాలకృష్ణ ఒక సామాన్యుడిలా బార్‌కు రావడాన్ని అభిమానులు మెచ్చుకుంటున్నారు. బాలయ్య చాలా విషయాల్లో అతిసాధారణంగా ఉంటారని, ఆయనకు భేషజాలు లేవని కొనియాడుతున్నారు. అయితే ఆయన ఈ వీడియో తీస్తున్నప్పుడు ఆయన చూసి ఉంటే కనుక ఆ వీడియో తీస్తున్న వారి చెంపలను ఆయన చెళ్లుమనిపించేవారని కొందరు అంటున్నారు.