ఇన్నాళ్లకు అసలైన నాయకుడొచ్చాడు… జీవితా రాజశేఖర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇన్నాళ్లకు అసలైన నాయకుడొచ్చాడు… జీవితా రాజశేఖర్

May 24, 2019

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా జీవితా రాజశేఖర్ కూడా జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన జీవితా రాజశేఖర్.. వైసీపీ తరపున గాజువాక, గన్నవరం, నందిగామ, భీమవరం, విజయవాడ తదితర నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రచారం నిర్వహించారు. వీళ్లు ప్రచారం చేసిన అనేక చోట్ల వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీంతో తమ కష్టానికి ప్రతిఫలం దక్కిందని జీవితా రాజశేఖర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

Actor Jeevitha Rajashekar say wishes to andhra pradesh Cm Jagan Mohan Reddy.

అంతేకాదు ఏపీ ప్రజలు కోరుకుంటున్న మంచి నాయకుడే సీఎం సీటు ఎక్కబోతున్నారని అన్నారు. జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉంటారని, అసలైన నాయకుడు అంటే ఎలా ఉంటాడో జగన్ చూపించబోతున్నారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తారని తాము నమ్ముతున్నామని జీవితా రాజశేఖర్ పేర్కొన్నారు.