హీరో, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు నెట్టింట ఏ చిన్న పనిచేసినా.. తెగ వైరల్ అవ్వడం కామన్‌గా మారిపోయింది. అతడు ఎప్పుడు దొరుకుతాడా అని ట్రోలర్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన మాట్లాడే మాటలను.. షేర్ చేసే ఫొటోలను భారీగా ట్రోల్ చేస్తుంటారు. తాజాగా షేర్ చేసిన ఓ ఫొటోపై కూడా నెటిజన్లు మరింత రెచ్చిపోయి మంచు విష్ణు ని సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ‘నేను పది పుష్ అప్లు చేసిన తర్వాత నేను ఇలా ఉంటానని ఊహించుకుంటాను..’ అంటూ ఓ దున్నపోతు ఫొటోను ట్వీట్ చేశాడు. ఆ దున్నపోతు బాగా బలిష్టంగా ఉంది. తాను పుష్ అప్లు తీసిన తరువాత కూడా మంచి బాడీ షేప్ వస్తుందనే అర్థంలో ఆయన ఈ ఫొటోను వాడారు.
This is how I imagine I am after I do ten push ups. 😊 pic.twitter.com/YvqadZBZtH
— Vishnu Manchu (@iVishnuManchu) September 17, 2022
కానీ నెటిజన్లు మాత్రం రకరకాల అర్థాలు వెతికి మరీ ట్రోల్ చేస్తున్నారు. దున్నపోతు ఫొటో షేర్ చేస్తే నెటిజన్లు ఊరుకుంటారా..? ఎప్పుడెప్పుడు మంచు ఫ్యామిలీపై ట్రోల్ చేద్దామనే ఎదురుచూసే కొంతమంది.. ఈ ట్వీట్ రాగానే నెగిటివ్ కామెంట్స్‌కు తెరలేపారు. ‘వర్కవుట్ చేయక ముందు కూడా దున్నపోతు దున్నపోతే’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరొకరు కమెడియన్ అలీ పిక్ తీసుకుని.. ‘అని ఎవరన్నారు? అంటే.. వాడే అనుకుంటున్నాడు’ అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.