ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరిపై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. తన చెల్లెలి జోలికొస్తే చేతులు ముడుచుకుని కూర్చోబోమని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. రాజకీయాలతో సంబంధం లేని తన కుటుంబ సభ్యులను దూషించడం సరికాదని పేర్కొన్నారు. నందమూరి కుటుంబ సభ్యులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో ఓ వైకాపా నేత.. నారా లోకేశ్ ఎవరికి పుట్టారని, దివంగత మాజీ మంత్రి మాధవరెడ్డి హత్యకు కారణమేంటని అనడంతో వివాదం రాజుకుంది.