8 గ్రామాలను దత్తత తీసుకున్న మోహన్ బాబు - MicTv.in - Telugu News
mictv telugu

8 గ్రామాలను దత్తత తీసుకున్న మోహన్ బాబు

April 7, 2020

Actor mohan babu adopted 8 villages

లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పేద ప్రజలను ఆదుకోవడానికి ఎందరో ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు మోహన్ బాబు తన పెద్ద కొడుకు విష్ణుతో కలిసి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 8 గ్రామాలను దత్తత తీసుకున్నారు. 

గత కొద్ది రోజులుగా దత్తత తీసుకున్న గ్రామాల్లోని ప్రజలకు రోజుకు రెండు పూటలా ఆహారం పంపిణీ చేస్తున్నారు. లాక్‌డౌన్ ముగిసే వరకు ఇలా ఆహారాన్ని పంపిణీ చేయనున్నారు. అలాగే ఎనిమిది టన్నుల కూరగాయలను ఈ గ్రామాల్లోని ప్రజలకి ఉచితంగా సరఫరా చేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లను కూడా అందిస్తున్నారు. ఈ విపత్కర సమయాల్లో మోహన్ బాబు, విష్ణు చేస్తున్న సేవను నెటిజన్లు సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు.