నాగబాబు ప్లాస్మా దానం.. చిరంజీవి ప్రశంస - MicTv.in - Telugu News
mictv telugu

నాగబాబు ప్లాస్మా దానం.. చిరంజీవి ప్రశంస

October 15, 2020

Actor nagababu donated plasma

కరోనా వైరస్‌కి ఇంకా వ్యాక్సిన్ రాలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న మందులతో చికిత్స అందిస్తున్నారు. అలాగే కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి ప్లాస్మాతో కూడా చికిత్స చేస్తున్నారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని డాక్టర్లు, ప్రభుత్వాలు కోరుతున్నాయి. 

ఈ నేపథ్యంలో ఇటీవల కరోనా వైరస్ నుంచి కోలుకున్న నటుడు నాగబాబు ఈరోజు సీసీటీలో ప్లాస్మా దానం చేశారు. దీనిపై నటుడు, నాగబాబు అన్న చిరంజీవి ట్విట్టర్‌లో స్పందించాడు. ‘కోవిడ్-19 తో పోరాడి గెలవటమే కాదు, ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో, సీసీటీలో ప్లాస్మా డొనేట్ చేసిన తమ్ముడు నాగబాబుకి అభినందనలు. ఈ సందర్భంగా కోవిడ్-19 నుంచి కోలుకున్నవారికి మరో మారు నా విన్నపం. మీరు ప్లాస్మా డొనేట్ చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు. దయచేసి ముందుకు రండి.’ అని చిరంజీవి ట్వీట్ చేశాడు.