Actor Naresh is getting ready for his fourth marriage.. video viral
mictv telugu

మేం పెళ్లి చేసుకోబోతున్నాం.. లిప్ లాక్‌తో అధికారికంగా ప్రకటన

December 31, 2022

టాలీవుడ్ ప్రేక్షకులకు నటులు నరేష్, పవిత్ర ల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పలు వివాదాలతో ఎన్నో సందర్భాల్లో వార్తల్లోకెక్కిన ఈ జంట.. తాజాగా ఓ వీడియో ద్వారా న్యూ ఇయర్ గ్రీటింగ్ చెబుతూ అందరికీ షాకిచ్చారు. అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ.. ఇన్నాళ్టికి తమ రిలేషన్ షిప్ విషయంలో అఫీషియల్‌గా ఓ క్లారిటీ ఇచ్చారు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ తనతో ఉన్న పవిత్ర బంధం గురించి ఓపెన్ అయ్యారు నరేష్ . తమ బంధాన్ని రివీల్ చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. కొత్త సంవత్సరం, కొత్త ఆరంభాలు, మీ అందరి ఆశీస్సులు కావాలి. మేమిద్దరం త్వరలోనే వివాహం చేసుకోనున్నాం అని నరేష్ పేర్కొన్నారు. #PavitraNaresh అనే హ్యాష్ ట్యాగ్‌ను దీనికి జత చేశారు. నరేశ్‌ ఎంతోకాలం నుంచి తన మూడో భార్య రమ్యకు దూరంగా ఉంటున్నారు. మనస్పర్థలు తలెత్తడంతో పవిత్ర సైతం తన భర్తకు దూరంగా జీవిస్తున్నారు. వీరిద్దరూ పలు సినిమాల్లో కలిసి నటించారు.