actor naresh prepared his next marriage with pavithra lokesh
mictv telugu

మరో పెళ్లికి సిద్ధమవుతున్న నటుడు నరేష్! వధువు మనకు తెలిసినావిడే

June 9, 2022

actor naresh prepared his next marriage with pavithra lokesh

అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్ రికార్డు సాధించిన వ్యక్తి స్వర్గీయ విజయనిర్మల. ఈమెకు మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం నటుడు, మాజీ మా చైర్మెన్ నరేష్ మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోగా, దాంతోపాటు వారితో విడాకులు కూడా మంజూరయ్యాయి. ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్న నరేష్ తనకు తోడు కావాలని భావిస్తున్నారు.

ఓ ప్రముఖ నటిని నాలుగో వివాహం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆవిడ ఎవరో కాదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించిన పవిత్ర లోకేష్. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో జంటగా కనిపించారు. ఆ పరిచయంతో నిజ జీవితంలో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారని భోగట్టా. ఇక పవిత్రా లోకేష్ విషయానికి వస్తే తన భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా జీవిస్తోంది. అయితే ఇంకా భర్తతో విడాకులు మంజూరు కానందున నరేష్‌తో వివాహానికి వెనకడుగు వేస్తున్నారని సన్నిహితులు చెప్తున్నారు. ఈ విషయం గత కొన్ని రోజులుగా ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నా ఇద్దరూ ఖండించకపోవడంతో నిజమేనని అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగనుందో.