విడాకులు ఎక్కువయ్యాయి.. మున్ముందు పెళ్లిళ్లు ఉండవు : నరేష్ - Telugu News - Mic tv
mictv telugu

విడాకులు ఎక్కువయ్యాయి.. మున్ముందు పెళ్లిళ్లు ఉండవు : నరేష్

June 23, 2022

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకున్న సీనియర్ నటుడు నరేష్.. మరో నటి పవిత్రా లోకేష్‌తో నాలుగో పెళ్లికి సిద్ధపడ్డాడనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నరేష్ సూటిగా స్పందించారు. అంతేకాక, వివాహ వ్యవస్థపై సంచలన కామెంట్లు చేశాడు. ‘నా దృష్టిలో పెళ్లి అనేది వేస్ట్. రానున్న రోజుల్లో వివాహ వ్యవస్థ ఉండదు. ఇప్పటికే పది మంది పెళ్లి చేసుకుంటే తక్కువలో తక్కువ నలుగురైదుగురు విడాకులు తీసుకుంటున్నారు. భార్యలు ఇంతకు ముందులా లేరు. సొంతంగా సంపాదన, బయటి ఫ్రెండ్స్, వ్యక్తిగత స్పేస్ అంటూ పెళ్లైన కొన్ని నెలలకే చాలా మంది అడ్జెస్ట్ అవ్వలేక విడాకులకు మొగ్గు చూపుతున్నారు. దీనికి ఫ్యామిలీ కోర్టులు పెరగడమే నిదర్శనం. కోట్ల రూపాయలు పెట్టి పెళ్లి చేయిస్తున్నారు. అవి కొన్ని రోజులకు పెటాకులవుతున్నాయి. విడాకుల కేసులు విపరీతంగా పెరిగాయి. ఇక నా గురించి చెప్తాను. నేను నెలలో 28 రోజులు పని చేస్తాను. ఆర్టిస్టుగా టైమింగ్, సెక్యూరిటీ ఉండదు. స్థిరత్వం అనేది అసలే ఉండదు. దాంతో నాతో సర్దుకుపోయేవారే నాతో ఉంటారు. లేనివాళ్లు వెళ్లిపోతారు. ఇక నాలుగు పెళ్లిళ్లు అంటున్నారు. ఏం? సినిమా వాళ్లే పెళ్లిళ్లు చేసుకుంటున్నారా? బయటి వాళ్లు చేసుకోవట్లేదా? ఎవరికి నచ్చినట్టు వారు ఉంటారు’ అంటూ అభిప్రాయపడ్డారు.