డ్రైవరుతో నా పెళ్లాం ఎఫైర్, ఇదేంటని అడిగితే.. నరేష్ - MicTv.in - Telugu News
mictv telugu

డ్రైవరుతో నా పెళ్లాం ఎఫైర్, ఇదేంటని అడిగితే.. నరేష్

July 1, 2022

క్యారెక్టర్ ఆర్టిస్టులు నరేష్, పవిత్ర లోకేష్‌ల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు పవిత్ర లోకేష్, ఆమె మొదటి భర్త, నరేష్ మూడో భార్యలు తమ తమ విషయాలను మీడియాతో పంచుకున్నారు. తాజాగా నరేష్ వంతు వచ్చింది. ఓ కన్నడ మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను నరేష్ ఇలా చెప్పుకొచ్చాడు. ‘నా మూడో భార్య రమ్య ఏనాడూ భార్యలా ప్రవర్తించలేదు. ఓ సారి ఇంట్లో ఫంక్షన్ ఏర్పాటు చేస్తే మేల్ క్యాబరే డ్యాన్సర్‌ని తీసుకొచ్చింది. నా దగ్గర పనిచేసే డ్రైవరుతో ఎఫైర్ పెట్టుకుంది. ఇదేంటని అడిగితే చెత్త వివరణలు ఇచ్చింది. పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించి ఆమెను దూరం పెట్టాను. నేను మానసికంగా కుంగిపోయినప్పుడు పవిత్ర నాకు అండగా నిలిచింది. నాకున్న అనేక మంది స్నేహితులు, ఆత్మీయులలో పవిత్ర ఒకరు. ఆమె మా ఫ్యామిలీ ఫంక్షన్లకు హాజరవుతుంటుంది. మాలో ఒకరిలా కలిసిపోతోంది. ఆమెపై తనకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటాయ’ని వెల్లడించారు.