నరేష్, పవిత్ర లోకేష్ గత కొన్నాళ్లుగా రిలేషిన్ షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే న్యూఇయర్ సందర్భంగా పవిత్ర, నరేష్ తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా వీళ్లిద్దరు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నారు. సాంప్రదాయ బద్ధంగా మూడుముళ్లతో, ఏడడుగులు వేసి జంటగా ఒక్కటయ్యారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి మ్యారేజ్ జరిగినట్లుగా తెలుస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త ప్రారంభాలు అని.. అందరి ఆశీస్సులు కావాలంటూ తమ రిలేషన్ గురించి నరేష్ అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడడుగులు అంటూ తాము పెళ్లి చేసుకున్న విషయాన్ని నరేష్, పవిత్ర లోకేష్ ట్విట్టర్ వేదికగా కన్ఫామ్ చేసారు.
కొన్ని నెలల క్రితం నరేష్ మూడో భార్య రమ్య.. తాను విడాకులివ్వనంటూ వీరిద్దరూ బెంగళూరులోని ఒక హోటల్ లో ఉన్నప్పుడు రాద్ధాంతం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నరేష్, పవిత్రా లోకేష్ విషయం హాట్ టాపిక్ గా మారింది. కొన్నిరోజులపాటు వీరి గురించే పెద్ద చర్చ నడిచింది. వీరిద్దరి వ్యవహారంపై మీడియాలో జోరుగా కథనాలు వచ్చాయి. దీంతో నరేష్…. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై నటుడు నరేష్ వేసిన పరువు నష్టం దావా కూడా వేశారు. ఇటు పవిత్ర కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక కొత్త ఏడాది వేళ ఈ జంట తమపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టే పనిలో పడింది. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు. అంతేకాదు.. నరేష్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పవిత్రకు లిప్ కిస్ ఇస్తూ తమ పెళ్లిపై అధికారికంగా ప్రకటన చేశారు. నరేష్ షేర్ చేసిన వీడియోలో వీరిద్దరు న్యూఇయర్ సందర్భంగా కేక్ కట్ చేశారు ఆ తర్వాత ఆ కేకును ఒకరికొకకరు తినిపంచుకున్నారు. అనంతరం ఇద్దరు లిప్ లాక్ చేసుకున్నారు. అప్పట్లో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. తాజాగా పెళ్లి వీడియో కూడా షేర్ చేయడంతో వీళ్లిద్దరికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు, వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారా? లేదా ఏదైనా సినిమా కోసం ఈ వీడియో షూట్ చేశారా? అనే దానిపై పూర్తి సమాచారం లేదు. ఎం.ఎస్.రాజు తెరకెక్కిస్తోన్న చిత్రంలో ఇది ఓ సన్నివేశమని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి