అందాల రాక్షసి సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర తండ్రయ్యాడు. ఆయన సతీమణి ఓరా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తమకు బాబు పుట్టినట్లు తెలిపాడు. పుట్టిన బిడ్డను ప్రేమతో ముద్దాడుతున్న దృశ్యాలను షేర్ చేశాడు. దీంతో అభిమానులతో పాటు పలువురు నటీ,నటులు నవీన్ చంద్ర దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హీరోతో పాటు విలక్షణమైన పాత్రలతో నవీన్ చంద్ర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అరవింద సమేతలో విలన్గా నటించి మెప్పించాడు నవీన్ చంద్ర. మిస్ ఇండియా, నేను లోకల్, ఎవరు, పటాస్,దేవదాస్, అమ్ము, రంగ రంగ వైభవంగా, గని, విరాటపర్వం వంటి నవీన్ చంద్రకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో నవీన్ చంద్ర చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హీరోగా ఓ బైలింగ్విల్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన సరసన వాణీ భోజన్, అమృతా అయ్యర్ నటిస్తున్నారు.