హాలీవుడ్‌లో విషాదం.. కరోనాతో నటుడు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

హాలీవుడ్‌లో విషాదం.. కరోనాతో నటుడు మృతి

July 6, 2020

mvmnv

హాలీవుడ్‌లో కరోనా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రముఖ నటుడు నిక్ కార్డెరో(41) కన్నుమూశారు. గత 90 రోజులుగా కరోనా వ్యాధితో పోరాడుతూ.. చివరకు ప్రాణాలు కోల్పోయారు. తక్కువ వయసులోనే కరోనా కారణంగా ఆయన చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అతని మరణంపై హాలీవుడ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  నిక్ కార్డెరో మరణం గురించి ఆయన భార్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

ఇటీవల అనారోగ్యంతో నిక్ లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్ సినాయ్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో చేరారు. అదే సమయంలో అతని కుడికాలిలో ర‌క్తం గ‌డ్డం క‌ట్ట‌డంతో  దాన్ని కూడా తొలగించారు. ఓ వైపు చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి చనిపోయాడు. కెనడాకు చెందిన నిక్ రంగ స్థల పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2014 బ్రాడ్‌వే మ్యూజికల్ బుల్లెట్స్ ఓవర్ బ్రాడ్‌వేలో నటించినందుకు సంగీతంలో ఉత్తమ నటుడిగా టోనీ అవార్డుకు ఎంపికయ్యారు. రెండుసార్లు డ్రామా డెస్క్ అవార్డులకు కూడా ఎంపికయ్యాడు. రాక్ ఆఫ్ ఏజెస్‌, వెయిట్ర‌స్‌, ఎ బ్రాంక్స్ టేల్ వంటి ప‌లు చిత్రాల్లోనూ న‌టించారు. బుల్లితెర‌పై వ‌చ్చే బ్లూ బ్ల‌డ్స్, లా అండ్ ఆర్డ‌ర్‌ సిరీస్‌లోనూ క‌నిపించారు.