నిఖిల్-పల్లవిల పెళ్లి వీడియో వైరల్.. - MicTv.in - Telugu News
mictv telugu

నిఖిల్-పల్లవిల పెళ్లి వీడియో వైరల్..

May 17, 2020

Actor nikhil siddarth wedding video goes viral

లాక్‌డౌన్ కారణంగా టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ పెళ్లి రెండు సార్లు వాయిదా పడిన సంగతి తెల్సిందే. ఎట్టకేలకు మే 14 నిఖిల్-పల్లవిల పెళ్లి తంతు ముగిసింది. శామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో తన ప్రియురాలు డాక్టర్ పల్లవి వర్మ మెడలో నిఖిల్ మూడు ముళ్లు వేశాడు. గురువారం ఉదయం 6.31 గంటలకు కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

 

తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన వీడియోను నిఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఈ పెళ్లి వీడియోకు ‘ఏమాయ చేసావే’ సినిమాలోని ‘మనసా మళ్లీ మళ్లీ చూసా’ అనే పాటను బ్యాక్ గ్రౌండ్‌ లో వచ్చేలా ఎడిట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.