నితిన్ పెళ్లి వాయిదా పడలేదు..వేదిక మారిందంతే! - MicTv.in - Telugu News
mictv telugu

నితిన్ పెళ్లి వాయిదా పడలేదు..వేదిక మారిందంతే!

March 25, 2020

nithin

నటుడు నితిన్ పెళ్లి వాయిదా పడిందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ముందుగా అనుకున్న ముహూర్తం ప్రకారమే ఏప్రిల్ 16న నితిన్ వివాహం జరగనుందని సమాచారం. అయితే, దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కాకుండా సింపుల్‌గా నాగ‌ర్‌క‌ర్నూల్‌లోని వధువు ఇంట్లో ఆయన పెళ్లి జరగనుంది. ఇరు వర్గాల కుటుంబ స‌భ్యుల మ‌ధ్య‌నే వివాహం జ‌రగ‌నుంద‌ని, కరోనా ప్రభావం తగ్గిన తరువాత హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్ష‌న్ నిర్వహించాలని నితిన్ త‌ల్లిదండ్రులు భావిస్తున్నారు. 

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన డా.సంపత్ కుమార్, నూర్జహాన్ దంపతుల రెండవ కుమార్తె షాలినితో నితిన్ పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లో నిశితార్థం కూడా జరిగింది. ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్లో నితిన్, షాలినీల పెళ్లి వేడుక జరపాలని ప్లాన్ చేశారు. కొద్ది మంది బంధువులు, మిత్రుల మధ్య దుబాయ్‌లో ఏప్రిల్ 15వ తేదీన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే ఏప్రిల్ 16వ తేదిన రిసెప్షన్ నిర్వహించాలని అనుకొన్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అరబ్‌ దేశాల్లో కఠినమైన ఆంక్షలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో జరగాల్సిన నితిన్‌ వివాహం హైదరాబాద్‌లో చేద్దాం అనుకున్నారు. కానీ, దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లడంతో పెళ్లి వేదిక నగర్ కర్నూల్‌కి మారింది.