ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య! - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య!

August 1, 2022

దివంగత నటుడు ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని {ఉమామహేశ్వరి 53} ఆకస్మికంగా మృతిచెందారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని స్వగృహంలో ఆమె చనిపోయారు. ఆమె అనారోగ్యంతో చనిపోయారని, లేదు ఆత్మహత్య చేసుకున్నారని భిన్న కథనాలు వస్తున్నాయి. ఆమె ఇంట్లో ఉరేసుకున్న దృశ్యం కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెడపై కమిలిన గీతలు ఉన్నట్లు సమాచారం. ఉమామహేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రిపోర్టు వచ్చాకే పూర్తి వివరాలు తెలియనున్నాయి. పోలీసులు అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేశారు. ఉమా మహేశ్వరికి నరేంద్ర రాజన్ అనే వ్యక్తితో మొదటి వివాహమైంది. రాజన్‌తో విడిపోయిన తర్వాత ఆమె కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్‌ అనే వ్యక్తిని పెళ్లాడారు. ఇటీవల కుమార్తెకు పెళ్లి చేశారు. ఉమా మహేశ్వరికి మానసిక సమస్యలు ఉన్నాయని, ఒత్తిడితోనే చనిపోయారని చెబుతున్నారు.