అల వైకుంఠపురం.. హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టాడు కార్తీక్ ఆర్యన్. షెహజాదా సినిమాతో మంచి ఊపు మీద ఉన్న ఈ నటుడు ట్రాఫిక్ రూల్స్ అధిగమించి తన కారును పార్క్ చేశాడు. దీనికి ముంబై పోలీసులు రెండు పెనాల్టీలు వేశారు. ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయం దర్శనానికి వెళ్లాడు. మామూలుగా వెళ్లి దర్శనం చేసుకుంటే సమస్య ఉండేది కాదు. కానీ సినిమా స్టైల్ లో తన కారును ఆ దేవాలయం ముందు పార్క్ చేశాడు. దీంతో ముంబై పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘన చర్యల కింద రెండు పెనాల్టీలు విధించారు.
ముంబై.. శుక్రవారం మధ్యాహ్నం 1గంటల సమయం. లంబోర్ఘిని కారును తీసుకొని సిద్ధి వినాయక టెంపుల్ వచ్చాడు. అయితే మామూలు దిశలో కాకుండా తప్పు దిశలో పార్క్ చేశాడు. దీంతో మొదటి రూ.500 చలాన్ అందుకున్నాడు. రెండవది రూ.750 మోటారు వెహికల్ యాక్ట్ కింద పోలీస్ ఆర్డర్, డైరెక్షన్, డిస్ఓబిడెయంట్స్ కోసం జారీ చేశారు. మొత్తంగా నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.1250 జరిమానా విధించబడింది. పూజ ముగించుకున్న తర్వాత కార్తీక్ ఈ చలాన్ అందుకున్నాడు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ‘నో పార్కింగ్ జోన్ లోనూ, రాంగ్ సైడ్ పార్కింగ్ లోనూ పార్క్ చేస్తే నటుడైనా, వీఐపీ అయినా పోలీసులు తమ పని తాము చేసుకుంటారని, చర్యలు తీసుకుంటామని ఒక పోలీసు అధికారి తెలిపారు. అయితే ముంబై సిటీ ట్రాఫఇక్ పోలీసులు నటుడి పేరును పేర్కొనకుండా అతను నటించిన సినిమా పేర్లను, డైలాగులను ఉపయోగించి ఒక ట్వీట్ పెట్టారు. “#RulesAajKalAndForever.” అంటూ పోస్ట్ చేయడంతో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించింది కార్తీక్ అని అర్థమైపోయింది. ఈ ట్వీట్ ని అధికంగా 88వేల మందికి పైగా వీక్షించి అతని పేరును ట్వీట్ చేశారు. ఈ ఒక్క నటుడే కాదు.. అంతకుముందు మరికొంతమంది బాలీవుడ్ నటులు కూడా ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఇలా చలాన్స్ అందుకున్నారు.