Actor Posani Krishna Murali regrets swearing at Pawan Kalyan
mictv telugu

పోసాని రివర్స్ గేర్.. పవన్‌ను తిట్టకుండా ఉండాల్సిందంటూ…

May 7, 2022

ఒకప్పుడు మాటల రచయితగా, కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న పోసాని కృష్ణ మురళీ.. తాను చేసిన ఓ తప్పు వల్ల ప్రస్తుతం బాధపడుతున్నాడట. ఆ మధ్య వైఎస్ జగన్ పార్టీలో చేరిన ఆయన.. ఆ పార్టీ మోజులో పడి పవన్ కళ్యాణ్ ను తిడితే తనకొక గుర్తింపు వస్తుందని, వైఎస్ జగన్ తనకంటూ ఓ పదవి కట్టబెడతాడని ఆశ పడ్డాడు. పదవి మాట అటుంచితే కనీసం జగనన్న పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడు రాజకీయంగా ఆయనకు ఎలాంటి విలువ లేకుండా పోయింది. మరోవైపు సినిమాల్లో కూడా అవకాశాలు రాకపోవడంతో.. అప్పుడప్పుడు ఏదో టీవీ షోలలో కనిపిస్తున్నాడు. దీనంతటికి కారణం గతంలో తాను చేసిన తప్పేనని తన సన్నిహితులతో చెప్పుకొని పశ్చాత్తాప పడుతున్నాడట.

పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా తిట్టకుండా ఉండాల్సిందని పోసాని బాధపడినట్లు సమాచారం. నిజానికి తాను పవన్ కళ్యాణ్ ని తప్ప.. చిరంజీవి గారిని కానీ, మెగా హీరోలను ఎప్పుడు విమర్శించలేదని, కేవలం పార్టీ కారణంగానే పవన్ కళ్యాణ్ ని తిట్టానంటూ తన స్నేహితులతో వాపోయాడట. కానీ ఏదీ ఏమైనా జరగాల్సిన అనర్ధం జరిగిపోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటు రాజకీయాల్లో కానీ, ఇటు సినిమాల్లో కానీ పోసానికి చెప్పుకోదగ్గ అవకాశాలైతే రాలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియక తన పరిస్థితికి తానే కారణమంటూ బాధపడుతున్నాడట.