ప్రభాస్ విరాళం కోటి.. సాయితేజ్, అల్లరి నరేశ్..  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్ విరాళం కోటి.. సాయితేజ్, అల్లరి నరేశ్.. 

March 26, 2020

Actor prabhas donates one crore 

టాలీవుడ్ పెద్ద మనసు చాటుకుంటోంది. కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలుస్తోంది. దిగ్గజ నటులు, దర్శకులు భూరి విరాళాలు ప్రకటిస్తున్నారు. ‘బాహుబలి’ ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున మొత్తం కోటి ప్రకటించారు. ముఖ్యమంత్రుల సహాయ నిధులకు ఈ డబ్బు జమ అవుతుంది. 

‘ప్రతిరోజు పండగే’ హిట్ కావడంతో జోరుమీదున్న సాయి ధరమ్ తేజ్ కూడా 20 లక్షలు ప్రకటించారు. అల్లరి నరేశ్ తన తాజా చిత్రం ‘నాంది’ యూనిట్‌లోని 50మంది కార్మికులకు  నిర్మాత సతీశ్ వేగేశ్నతో కలసి రూ.10 వేల చొప్పున సాయం అందజేస్తానని చెప్పాడు. కరోనాపై వార్ కోసం పవన్ కల్యాణ్ రూ. 2 కోట్లు, చిరంజీవి, మహేశ్ బాబు రూ. కోటి, దర్శకుడు త్రివిక్రమ్ రూ. 20 లక్షలు, అనిల్ రావిపూడి రూ. 10 లక్షలు ప్రకటించారు. నాగార్జున, నాగచైతన్య, నందమూరి నటులు కూడా భారీ విరాళాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.