Actor Prakash Raj Mind Blowing Counter To Pm Modi And Hero Vishal
mictv telugu

ఒక్క మొగాడు ప్రకాష్ రాజ్.. మోదీ, విశాల్ లు తలదించుకునేలా ట్వీట్

November 3, 2022

Actor Prakash Raj Mind Blowing Counter To Pm Modi And Hero Vishal

చిత్ర పరిశ్రమ నుండి నరేంద్ర మోదీని ఎండగట్టడంలో నటుడు ప్రకాష్ రాజ్ ముందంజలో ఉంటాడు. దేశం కోసం ధర్మ కోసం, జైశ్రీరామ్ అంటూ దేశప్రజల్లో ముస్లిం వ్యతిరేక భావజాలం నింపి ఓట్లు దండుకుంటున్న మోదీని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ఫుట్ బాల్ ఆడుకుంటాడు. జస్ట్ ఆస్కింగ్ అంటూ సమాదానాలు సైతం చెప్పలేని వ్యంగ్యాస్త్రాలు సందిస్తుంటాడు. తాజాగా నరేంద్ర మోదీ, హీరో విశాల్ లు ప్రకాష్ రాజ్ వ్యంగ్యానికి బలయ్యారని అంటున్నారు. మోదీ విధానాలనే కాదు.. ప్రయోజనం ఆశిస్తూ మోదీని పొగిడే వారిని సైతం ప్రకాష్ రాజ్ పలకరిస్తారు. హీరో విశాల్ ఇటీవల కాశీ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోదీని పొగుడుతూ ట్వీట్ చేశాడు. గతంతో పోలిస్తే కాశీలో గొప్పగా అభివృద్ది జరిగిందని, పవిత్ర గంగానది జలాన్ని తాకానని, ఆలయాల పునరుద్దరించడం ద్వారా మీరు చేసిన అభివృద్ధికి ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని, కాశీ ఇప్పుడు అద్భుతంగా ఉందంటూ హీరో విశాల్ ట్వీట్ చేశాడు.

అయితే విశాల్ ట్వీట్ కి నరేంద్ర మోడీ కూడా సమాధానం ఇచ్చాడు. ప్రశ్నించే ప్రజలను పట్టించుకోని మోదీ ప్రశంసించిన వారిని మాత్రం పేరు పేరునా పలకరిస్తాడు. హీరో విశాల్ చేసిన ట్వీట్ కి మోదీ జవాబిస్తూ.. ‘మీరు కాశీలో అద్భుతమైన అనుభవం పొందినందుకు ఆనందంగా వుందన్నారు. అయితే ఇదంతా పెద్ద పబ్లిసిటీ స్టెంట్ అని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇప్పటికే మతం పేరుతో బెదిరించి బాలీవుడ్ హీరోలని మచ్చిక చేసుకున్న ఈ గుజరాతీ బ్యాచ్.. ఇప్పుడు రజినీకాంత్, ఎన్టీఆర్ వంటి హీరోలని దువ్వుతున్నారు. ఇందులో భాగంగానే హీరో విశాల్ తో పొగిడించుకున్నారని విమర్శలు వస్తున్నాయి. సినిమా డ్రామాని తలపించే మోదీ, విశాల్ లని ఎండగడుతూ ప్రకాష్ రాజ్ సింగిల్ లైన్ కౌంటర్ ఇచ్చాడు. ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో వ్యగ్యంగా ‘షాట్ ఓకే నెక్స్ట్? ‘ అంటూ టెర్రిఫిక్ రిప్లై ఇచ్చాడు. ‘మోదీ, విశాల్ లు ట్విట్టర్ లో యాక్టింగ్ చించేశారనా ప్రకాష్ రాజ్ ఉద్దేశం’? అంటూ నెటిజన్స్ కామెంట్ లు చేస్తున్నారు.