రియల్ మోనార్క్.. ఏకంగా అక్షయ్ కుమార్ నే ఢీ కొట్టేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

రియల్ మోనార్క్.. ఏకంగా అక్షయ్ కుమార్ నే ఢీ కొట్టేశాడు

November 26, 2022

బార్డర్ లో మన ఆర్మీ రోజుకొక సవాల్ ఎదుర్కొంటున్నా.. రాజకీయాల కోసం బీజేపీ అసలు నిజాలు దాస్తుందని, ఇండియన్ ఆర్మీ విజయాలని బీజేపీ క్రెడిట్ గా ప్రజలకు చూపెడుతుందని, కొందరు ఆర్మీ సభ్యులు సైతం బీజేపీ మౌత్ పీస్ లా తయారయ్యారని ఎప్పటినుండో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా మోదీ తప్పిదాలతో చైనా చేతిలో భారత్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంటుందని.. దీనిని ప్రశ్నిస్తే దేశద్రోహులుగా బీజేపీ చిత్రీకరిస్తుందని అంటుంటారు. తాజాగా ఈ నిజాన్ని ప్రజలకు అర్థమయ్యేలా బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా సెటైరికల్ కామెంట్స్ చేయగా.. బీజేపీ, వారి తొత్తులు రిచాని టార్గెట్ చేస్తున్నారు. రిచా చద్దాను తప్పుబడుతూ బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇతనికి మోదీ తొత్తుగా పేరుంది. రిచా ట్వీట్‌పై అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. “ఇది చూస్తుంటే బాధగా ఉంది. మన ఆర్మీ పట్ల కృతజ్ఞతగా ఉండాలి. వో హైన్ తో ఆజ్ హమ్ హై (వారు అక్కడ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ హాయిగా ఉన్నాము) అంటూ ఎమోషనల్ టచ్ ఇచ్చేలా ప్రయత్నించాడు.

అయితే మోడీ చేతకానితనానికి బార్డర్ లో ఇండియన్ ఆర్మీ చైనా చేతిలో బలవుతుందని నటుడు ప్రకాష్ రాజ్ ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు. బీజేపీ అనాలోచిత చర్యలతోనే గాల్వన్ లో మన సైనికుల్ని పోగోట్టుకున్నామన్నది నగ్నసత్యం అని మేధావులు సైతం చెప్తుంటారు. ప్రకాష్ రాజ్ కూడా జస్ట్ ఆస్కింగ్ పేరిట మోదీ, బీజేపీ తప్పిదాలని ఎప్పటికప్పుడు ఎండగడుతుంటాడు. తాజాగా రిచా చద్దా కి సైతం మద్దతుగా నిలిచాడు ఈ మోనార్క్. అక్షయ్ కుమార్ ఇలా ఆమెను తప్పుబడతారని అనుకోలేదంటూ ప్రకాష్ రాజ్ అన్నాడు. రీచా చద్దాకు నేను సపోర్ట్‌గా నిలుస్తున్నాను.. ఆమె ఏ ఉద్దేశ్యంతో వ్యాఖ్యానించిందో నాకు తెలుసు అంటూ ప్రకాష్‌ రాజ్‌ రిచాకి మద్దత్తిచ్చారు. అయితే గతంలో గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో మోడీ కూడా ఇలానే ఆర్మీ మీద చులకన భావంతో ట్వీట్లు వేశారంటూ నాటి ట్వీట్లను వైరల్ చేస్తున్నారు నెటిజన్స్.