టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కారుకు ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్లో అతడు వెళ్తున్న కారును మరో కారు ఢీ కొట్టింది. దీంతో అతడి వాహనం స్వల్పంగా ధ్వంసం అయింది. ఈ విషయాన్ని ఆయన ఫేస్బుక్ టీం వెల్లడించింది. కారు ఢీ కొట్టిన వెంటనే జనం భారీగా గుమిగూడారు. స్వల్ప ప్రమాదమే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
స్థానికంగా ఉండే క్యాన్సర్ ఆస్పత్రి వైపు నుంచి వినాయక మండపం వైపు వెళ్తున్న రోడ్డులో ఇది జరిగింది. ఆయన కారు ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, ఇటీవలే కరోనా బారిన పడి ఆయన కోలుకున్నారు. 15 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్నారు. బయటకు వచ్చిన ఆయనకు ఇలా ప్రమాదం జరగడంతో పలువురు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.