నువ్వేమన్నా లోక రక్షకుడివా? పవన్‌పై ‘ఆనంద్’ హీరో ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

నువ్వేమన్నా లోక రక్షకుడివా? పవన్‌పై ‘ఆనంద్’ హీరో ఫైర్

January 27, 2020

Actor Raja

‘నువ్వేమన్నా మెసయ్యవా? లోకరక్షకుడివా? ఎందుకలా మాట్లాడతావు?’ అని సినీ నటుడు రాజా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీకు ఎందుకంత అహంకారం? అని విరుచుకుపడ్డారు. ‘ఎవరు నువ్వు. ఎందుకయ్యా నీకు అంత అహంకారం. నువ్వు ఏమన్నా లోక రక్షకుడివా. ప్రజల మధ్యలోకి వెళ్లి కనీసం ఓ వారం రోజులు పాదయాత్ర చేయ్యవయ్యా పవన్ కల్యాణ్. వాళ్ల బాధలు, ఆవేదన తెలుసుకోండి. అప్పుడు మీకు ప్రజల కష్టాలు తెలుస్తాయి. అప్పుడు మాట్లాడండి మీరు. ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివేసి మాట్లాడడం కాదు. లేకపోతే నిన్నొక బొమ్మలా నడిపిస్తే వాళ్లు చెప్పిన మాట ప్రకారం కీలుబొమ్మలా మాట్లాడొద్దు’ అని రాజా అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 

ఇప్పటికే పవన్ అభిమానులు రాజాపై విరుచుకు పడుతున్నారు. కొంతకాలంగా మీడియాకు, సినిమాలకు కూడా దూరంగా ఉన్న రాజా అకస్మాత్తుగా తెరపైకి వచ్చి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ‘ఆనంద్’ సినిమాతో తెలుగు సినిమా రంగానికి పరిచయం అయిన రాజా ఆ నలుగురు, విజయం వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. సినిమాల్లో నటిస్తూనే అకస్మాత్తుగా సినిమాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. మతప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయారు. 2014లో రాజా అమృతను వివాహం చేసుకున్నారు.