నటుడు రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు! - MicTv.in - Telugu News
mictv telugu

నటుడు రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు!

November 29, 2019

ఇటీవల నటుడు రాజశేఖర్ ఔటర్ రింగ్ రోడ్డుపై పరిమితికి మించిన వేగంతో వాహనం నడుపుతూ ప్రమాదానికి గురైన సంగతి తెల్సిందే. ఈ ప్రమాదంలో ఆయన కారు అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టింది. సమయానికి ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది. 

Actor rajasekhar.

ఈ నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఆర్టీయే అధికారులకు సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆర్టీయేకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ లేఖను పంపారు. ఓఆర్ఆర్‌పై ఇంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వుందని వారు గుర్తు చేశారు. కాగా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సిఫార్సులపై ఆర్టీయే అధికారులు నిర్ణయం తీసుకోవాల్సివుంది. కనీసం ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే రాజశేఖర్ ట్రాఫిక్ నిబంధలను పలు మార్లు ఉల్లఘించిన నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2017లో కూడా రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఒక వ్యక్తి కారుని తన కారుతో ఢీ కొట్టారు. ఆరోజు ఆయన తాగి డ్రైవ్ చేసినట్టు బాధితులు ఫిర్యాదు చేసారు. ఆ సమయంలో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేయగా.. ఆయన తాగలేదని తేలింది.