మత్తు కేసు.. విచారణకు హాజరైన రకుల్ - MicTv.in - Telugu News
mictv telugu

మత్తు కేసు.. విచారణకు హాజరైన రకుల్

September 25, 2020

Actor Rakul Preet Questioned In Drugs Probe.

దేశంలోని ఒక్కో చిత్రసీమను డ్రగ్స్ వివాదం కుదిపేస్తోంది. హిందీలో మొదలైన ఈ వివాదం కన్నడ మీదుగా తెలుగు చిత్రసీమలోకి వచ్చి దుమారం రేపుతోంది. నటుడు సుశాంత్ మరణం గురించిన జరిగిన విచారణ డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. సుశాంత్ కేసులో పోలీసులు ఆయన మాజీ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని విచారిస్తుండగా బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ బట్టబయలైంది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) రంగంలోకి దిగి విచారణ ముమ్మరం చేసింది. ఎన్సీబీ విచారణలో రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధ దాస్, నమ్రత శిరోద్కర్, దియా మీర్జల పేర్లు బయటికి వచ్చాయి.

ఎన్సీబీ అధికారులు వీరికి సమన్లు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించారు. సమన్లు అందుకున్న రకుల్ ఈరోజు ముంబైలో ఎన్సీబీ అధికారుల ముందు హాజరైంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బల్లార్డ్ ఎట్ఏట్ వద్ద వున్న ఎన్సీబీ గెస్ట్ హౌస్‌లో రకుల్ విచారణకు హాజరైనట్టు సమాచారం. రకుల్‌తో పాటు నటి దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్‌ను కూడా ఎన్‌సిబి ప్రశ్నిస్తోంది. ఈ కేసులో దీపికా పదుకొనేను శనివారం ప్రశ్నించనున్నారు.