ప్రియురాలిని పరిచయం చేసిన రానా.. ఓకే చెప్పేసింది..  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియురాలిని పరిచయం చేసిన రానా.. ఓకే చెప్పేసింది.. 

May 12, 2020

actor Rana Daggubati Announces His Engagement with Miheeka Bajaj

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో రానా దగ్గుబాటి ఒకరు. ఎప్పటినుంచో రానా పెళ్లి గురించి సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే రానా ఈరోజు తన బ్యాచిలర్ జీవితానికి శుభం కార్డు వేసాడు. హైదరాబాద్ కి చెందిన మిహీకా బజాజ్ అనే అమ్మాయితో తానూ ప్రేమలో ఉన్నట్టు..ఆమె పెళ్ళికి ఒప్పుకుందని రానా ఈరోజు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో వాళ్లిద్దరూ ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరోయిన్లు సమంత, హన్సిక, శ్రుతి హాసన్, రాశీ ఖన్నా, కియారా అడ్వాణీ సహా అందరూ రానాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

మిహీకా బజాజ్‌ వృత్తి రీత్యా ఈవెంట్ మేనేజర్. ఆమె ‘డ్యూ డ్రాప్‌ స్టూడియో’ అనే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఇక రానా సినిమాల విషయానికి వస్తే..అతడు నటించిన ‘అరణ్య’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. అలాగే వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ‘విరాటపర్వం’ రానా నటిస్తున్నారు. ఈ సినిమాలో రానా నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారు.

View this post on Instagram

And she said Yes 🙂 ❤️#MiheekaBajaj

A post shared by Rana Daggubati (@ranadaggubati) on