రానా తమ్ముడి కారుకు ప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

రానా తమ్ముడి కారుకు ప్రమాదం

August 13, 2020

Actor rana daggubati brother car met with accident

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు, నటుడు రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓ వ్యక్తి టెస్ట్‌ డ్రైవింగ్‌ చేస్తున్న కారు, అభిరామ్‌ ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో రెండు కార్లు పాక్షికంగా ధ్వంసమైనాయి. కరీంనగర్‌ జిల్లా ఆరేపల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి మెకానిక్‌ లక్ష్మణ్‌ ద్వారా బ్రీజా కారు కొనేందుకు హైదరాబాద్ కి వచ్చాడు. మణికొండలో యజమాని నుంచి టెస్ట్‌ డ్రైవ్‌ కోసం కారు తీసుకున్నాడు.

కారులో ఫ్రెండ్ సతీష్‌ ను ఎక్కించుకుని టెస్ట్ డ్రైవ్‌ చేయడానికి వెళ్లాడు. పంచవటి కాలనీలో మల్లెమాల ప్రొడక్షన్‌ హౌస్‌ దగ్గరికి రాగానే పక్క రోడ్డులోంచి వచ్చినా అభిరామ్ బీఎండబ్ల్యూ కారు, బ్రీజా కారు ఢీ కొట్టుకున్నాయి. దీంతో రాజు, అభిరామ్‌లు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కారు నడిపిన ఇద్దరికీ బ్రీత్‌ ఎనలైజర్‌ చేయగా ఎవరూ మద్యం మత్తులో లేరని తేలిందని రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రవిందర్‌ తెలిపారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తేనే తప్పు ఎవరిదనే విషయం తెలుస్తుందన్నారు.