Actor Rana Daggubati Is Going To Be A Father Soon News Going Viral
mictv telugu

హీరో రానా అద్దిరిపోయే శుభవార్త.. దగ్గుబాటి ఫ్యామిలీలో సంబరాలు

October 26, 2022

తెలుగు నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో రానా దగ్గుబాటి. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ రానా అంటే క్రేజ్ ఉంటుంది. అయితే బాహుబలితో నటుడిగా తానేంటో నిరూపించుకున్న దగ్గుపాటి రానా నుండి ఒక అద్దిరిపోయే శుభవార్త రానున్నట్టు వార్తలొస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు 8న మిహీకా బజాజ్‌ ని ప్రేమించి పెళ్లాడిన రానా.. తాజా సమాచారం ప్రకారం తండ్రి కాబోతున్నాడట. దీంతో దగ్గుపాటి కుటుంబంలో సంబురాలు జరపబోతున్నట్టు టాక్. త్వరలోనే ఈ జంట అభిమానులకు, ప్రేక్షకులకు ఈ శుభవార్తని అధికారికంగా అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తుంది.

ఇక రానా, మిహికా బజాజ్ పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తమ ఫొటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేశారు. దీంతో వారిద్దరూ విడిపోతున్నారనే వార్త కూడా అప్పట్లో వైరల్‌గా మారింది. ఈ బ్రేకప్ వార్తలకు చెక్ పెడుతూ అప్పుడే మిహిక తన సోషల్ మీడియాలో రానాతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం చేతిలో వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు రానా. ఇక త్వరలోనే బాబాయ్‌ వెంకటేష్‌తో కలిసి రానా నాయుడు వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ క్రమంలో రానాకు సంబంధించి ఈ వార్త తెగ వైరలవుతోంది.